రిథమ్‌‌-ఉజ్వల్‌‌కు గోల్డ్‌‌

రిథమ్‌‌-ఉజ్వల్‌‌కు గోల్డ్‌‌

కైరో: ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా షూటర్లు బోణీ చేశారు.  శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో రిథమ్‌‌ సంగ్వాన్‌‌–ఉజ్వల్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిశారు. ఫైనల్లో ఇండియా జోడీ 17–7తో ఎల్మిరా కరాపెటయాన్‌‌–బెనిక్‌‌ కల్గట్యాన్‌‌ (ఆర్మేనియా)పై గెలిచింది.

10 మీటర్ల ఎయిర్‌‌ రైఫిల్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌లో అర్జున్‌‌ బబుటా–సోనమ్‌‌ ఉత్తమ్‌‌ మస్కర్‌‌ సిల్వర్‌‌ మెడల్‌‌ను సాధించారు. ఇక విమెన్స్‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ ఈవెంట్‌‌లో అనురాధా దేవి సిల్వర్‌‌ నెగ్గింది. షాట్‌‌ గన్‌‌లో ఇండియా నుంచి ఒక్క షూటర్‌‌ కూడా ఫైనల్స్‌‌కు చేరుకోలేదు.