పోలీసులకు తేజ్ ప్రతాప్ యాదవ్ లేఖ

పోలీసులకు  తేజ్ ప్రతాప్ యాదవ్ లేఖ

రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పోలీసులకు లేఖ రాశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కి రాసిన లేఖలో తనకు పోలీసుల నుండి వై-సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేశారు.  భారతదేశంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు.

అయితే ‘వై’ కేటగిరీ భద్రతలో 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారిలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (పీఎస్ఓ)లు ఉంటారు. వై ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీలో ఒక ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదనంగా ఒక గార్డ్ కమాండర్, నలుగురు గార్డులను కూడా ఇస్తారు. ఈ గార్డుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి మిగతా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి కనీసం ఇద్దరు రక్షణ కల్పిస్తారు.