మిలటరీ స్టేషన్, రోడ్డుకు బిపిన్ రావత్ పేరు

మిలటరీ స్టేషన్, రోడ్డుకు బిపిన్ రావత్ పేరు

కిబితు: ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) దివంగత జనరల్ బిపిన్ రావత్ స్మారకార్థం అరుణాచల్ ప్రదేశ్ కిబితులోని మిలటరీ స్టేషన్, రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. చైనా బార్డర్​కు దగ్గర్లోని ఈ మిలటరీ క్యాంప్ పేరును జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గ్యారీసన్​గా మార్చారు. వాలాంగ్ నుంచి కిబితు వరకు ఉన్న రోడ్డుకు జనరల్ బిపిన్ రావత్ మార్గ్ అని పేరు పెట్టారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ బీడీ శర్మ, సీఎం పెమా ఖండూ, తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రానా ప్రతాప్ కలిత, రావత్ బిడ్డలు కృతిక, తరిణి తదితరులు హాజరయ్యారు. కాగా, రావత్ కల్నల్​గా 1999 నుంచి 2000 వరకు కిబితులో 5/11 గోర్ఖా రైఫిల్స్ బెటాలియన్​కు నాయకత్వం వహించారు.