V6 News

వరల్డ్ కప్ లో సత్తాచాటింది వీరే : ఫస్ట్ ప్లేస్ లో రోహిత్

వరల్డ్ కప్ లో సత్తాచాటింది వీరే : ఫస్ట్ ప్లేస్ లో రోహిత్

వరల్డ్ కప్-2019 ముగిసింది. ఫైనల్ మంచి థ్రిల్లింగ్ ఇచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మ్యాచుల్లో సత్తా చాటిన ప్లేయర్ల లిస్టును బుధవారం అనౌన్స్ చేసింది ICC. టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన భారత హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ మేరకు ICC తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ చేసింది. ‘‘ఈ ఐదుగురు బ్యాట్స్‌ మెన్‌ ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత ప్రత్యేకం’’ శీర్షికతో ఓ వీడియోను ఉంచింది. ఇందులో రోహిత్‌ శర్మతో పాటు మరో నలుగురి పేర్లను పొందుపర్చింది. ఈ లిస్ట్ లో  రోహిత్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ తరువాతి ప్లేస్ లో ఉన్నారు.

రోహిత్‌ శర్మ 81 స్ట్రైక్ రేటుతో 648 రన్స్ చేసి వరల్డ్ కప్ 2019 టోర్నీ మొత్తంలో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ తో తలపడిన భారత్‌ పోరాడి ఓడడంతో రోహిత్‌ శ్రమ ఒకరకంగా వృథా అయిందనే చెప్పాలి. వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీ ఉత్తమ టీమ్ ను సోమవారం ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలోనూ రోహిత్‌ కు చోటు దక్కడం విశేషం. భారత్‌ నుంచి యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రాకు కూడా స్థానం కల్పించారు. కప్ సాధించలేక పోయినా 5 సెంచరీలతో వరల్డ్ కప్ మొనగాడుగా రోహిత్ రికార్డుకెక్కడం భారత్ కు గర్వకారణమే అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.