సింగరేణి కి సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కింద 156 కోట్లు కేటాయించాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణి కి సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కింద 156 కోట్లు కేటాయించాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • ఎంపీ అర్వింద్ ప్రశ్నకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి కాలరీస్ కు 2025–26 ఫైనాన్స్ ఈయర్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ. 156 కోట్లు కేటాయించినట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి సీఎస్‌‌‌‌ఆర్ వ్యయం 2024–25లో రూ. 107.88 కోట్లకు పెరిగినందున 2025–26లో ఈ బడ్జెట్‌‌‌‌ను రూ. 156 కోట్లుగా ఆమోదించినట్టు తెలిపారు. ఈ మేరకు బీజేపి ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 

ముఖ్యంగా సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం కింద రూ. 2.02 కోట్లు, జాబ్ మేళాల నిర్వహణకు రూ. 1.48 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. భూపాలపల్లి, ఆసిఫాబాద్, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో గ్రామీణాభివృద్ధి పనులు, మణుగూరులో నీటి వనరుల అభివృద్ధి, మంచిర్యాల (లక్సెట్టిపేట)లో విద్యా, వైద్య మౌలిక సదుపాయాలకు నిధులు ఖర్చు చేయనున్నట్టు సమాధానంలో పొందుపరిచారు.