జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ రికార్డ్

జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ రికార్డ్

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఆల్​ టైం హై లెవెల్​కు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో రూ.1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. స్థూల​ జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.  వీటి వసూళ్లు మార్చి 2022లో రూ.1.42 లక్షల కోట్ల వరకు ఉన్నాయి.  ఈ ఏప్రిల్ నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,67,540 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ రూ.33,159 కోట్లు, ఎస్​జీఎస్టీ రూ.41,793 కోట్లు , ఐజీఎస్టీ రూ.81,939 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 36,705 కోట్లతో సహా)  సెస్ రూ.10,649 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.857 కోట్లతో కలిపి) ఉన్నాయి. 2022 ఏప్రిల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఇది వరకటి ఆల్​ టైం హై లెవెల్​ కంటే రూ. 25వేల కోట్లు ఎక్కువ. మార్చి నెలలో వీటి విలువ రూ.1,42,095 కోట్లు మాత్రమే.   “ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.33,423 కోట్లు,  ఎస్​జీఎస్టీకి రూ.26,962 కోట్లు చెల్లించింది. సాధారణ సెటిల్‌‌‌‌మెంట్ తర్వాత 2022 ఏప్రిల్​లో కేంద్రం,  రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.66,582 కోట్లు,  ఎస్​జీఎస్టీకి రూ.68,755 కోట్లు’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 2022 ఏప్రిల్  నెలలో రాబడులు  పోయిన సంవత్సరం ఏప్రిల్ జీఎస్టీ రాబడి కంటే 20 శాతం ఎక్కువ.  ఈ ఏడాది ఏప్రిల్​లో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 30శాతం ఎక్కువగా ఉన్నాయి.  దేశీ  లావాదేవీల ద్వారా పోయిన నెల వచ్చిన ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) ఇవే మూలాల నుండి 2021 ఏప్రిల్​లో వచ్చిన ఆదాయాల కంటే 17%  ఎక్కువగా ఉన్నాయి.  

వసూళ్లలో తెలంగాణ అదుర్స్​

తెలంగాణ జీఎస్టీ వసూళ్ల లో 16 శాతం గ్రోత్ రికార్డ్ అయింది. 2021 ఏప్రిలో రూ. 4,262 కోట్లు వసూలు కాగా,  2022 ఏప్రిలో రూ. 4,955 కోట్లు వసూలు అయ్యాయి. 2022 మార్చిలో వచ్చిన మొత్తం ఈ–-వే బిల్లుల సంఖ్య 7.7 కోట్లు. ఇవి ఫిబ్రవరి 2022 నెలలో వచ్చిన 6.8 కోట్ల ఈ-వే బిల్లుల కంటే 13శాతం ఎక్కువ. బిజినెస్​లు వేగంగా రికవర్​ అవుతున్నాయని చెప్పడానికే ఇవే రుజువులని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.  2022 ఏప్రిల్లో  20వ తేదీన అత్యధికంగా పన్ను వసూళ్లు రికార్డు అయ్యాయి.  ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు.. అంటే ఒక గంట సమయంలో 9.58 లక్షల ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.57,847 కోట్లను చెల్లించారు. అంతకుముందు.. అంటే మధ్యాహ్నం 2–3 గంటల మధ్య కూడా దాదాపు రూ.ఎనిమిది వేల కోట్లు 88వేల లావాదేవీల ద్వారా వచ్చాయి. పోయిన సంవత్సరం (అవే తేదీల్లో) ఇదే సమయాల్లో వరుసగా 7.22 లక్షల లావాదేవీల ద్వారా రూ.48వేల కోట్లు, 65వేల లావాదేవీల ద్వారా రూ.6,400 కోట్లు వచ్చాయి.  2022 ఏప్రిల్లో, జీఎస్టీఆర్​-3బీలో 1.06 కోట్ల జీఎస్టీ రిటర్న్‌‌‌‌లు దాఖలు అయ్యాయి. వీటిలో 97 లక్షలు మార్చి 2022 నెలకు సంబంధించినవి. 2021 ఏప్రిల్లో మొత్తం 92 లక్షల రిటర్న్‌‌‌‌లు దాఖలవగా, ఏప్రిల్‌‌‌‌లో 2022, జీఎస్టీఆర్-1లో  ఏకంగా 1.05 కోట్ల స్టేట్‌‌‌‌మెంట్లు అందాయి.