సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ

 సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ

ముంబై: ఈక్విటీల వాల్యుయేషన్‌‌‌‌పై ఆందోళనల కారణంగా హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్,  ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నీరసించడంతో ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు మంగళవారం క్షీణించాయి. సెన్సెక్స్ 383.69 పాయింట్లు తగ్గి 73,511.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 636.28 పాయింట్లు తగ్గి 73,259.26 వద్దకు చేరుకుంది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 140.20 పాయింట్లు క్షీణించి 22,302.50 వద్దకు చేరుకుంది. 

సెన్సెక్స్ బాస్కెట్ నుంచి, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్​డబ్ల్యూ  స్టీల్, ఎన్టీపీసీ, హెచ్​సీఎల్​, టెక్నాలజీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్  రిలయన్స్ వెనుకబడి ఉన్నాయి.   హిందుస్థాన్ యూనిలీవర్ 5 శాతానికి పైగా పెరిగింది. టెక్ మహీంద్రా, నెస్లే, ఐటీసీ, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌, కోటక్‌‌‌‌ మహీంద్రా బ్యాంక్‌‌‌‌లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో  షాంఘై లాభాలతో స్థిరపడగా, హాంకాంగ్ నష్టాలతో ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.