V6 News

ఆర్టీసీలో నష్టాలు భారీగా తగ్గినయ్: సజ్జనార్  

ఆర్టీసీలో నష్టాలు భారీగా తగ్గినయ్: సజ్జనార్  
  • చార్జీల పెంపుపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ 
  • పీఆర్సీ, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి 
  • ఆర్టీసీ 2022 యాన్యువల్ రిపోర్ట్ విడుదల

హైదరాబాద్, వెలుగు: డీజిల్ సెస్ పెంచినా జనం సంతోషంగా ఉన్నరని, బస్ చార్జీల పెంపును పబ్లిక్ వ్యతిరేకించలేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కలిసి ఆర్టీసీ 2022 యాన్యువల్ రిపోర్ట్ ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

డీజిల్ ధర పెరిగినందున బస్ టికెట్ పై డీజిల్ సెస్ ను ఈ ఏడాది ఏప్రిల్, జూన్ లో రెండు సార్లు పెంచామని, దీనిని ప్యాసింజర్లు అంగీకరించారని చెప్పారు. ఈ ఏడాదిలో ఆర్టీసీకి మంచి రెవెన్యూ వచ్చిందన్నారు. ఇప్పుడిప్పుడే సంస్థ నష్టాలను తగ్గించుకుంటోందని, కార్మికులకు పీఆర్సీతో పాటు ఇతర సమస్యలన్నీ సా ల్వ్ చేస్తామన్నారు. ఇటీవల కార్మికులకు 5 డీఏలు ఇచ్చామని చెప్పారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్దరిస్తామని మునుగోడు ఎన్నికల టైంలో తాము హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తిరుమల యాత్రకు రోజూ 1000 టికెట్లు ఇస్తున్నామని, దీనికి మంచి స్పందన వస్తోందన్నారు. పాత బస్సుల స్థానంలో 760 కొత్త బస్సులు తెస్తున్నామన్నారు.   

ఆర్టీసీని గాడిలో పెడుతున్నం.. 

ఆర్టీసీ లో ఈ ఏడాది చేపట్టిన రిఫామ్స్ మంచి ఫలితా లను ఇచ్చాయని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. కరోనాతో ఆర్టీసీకి చాలా నష్టం వచ్చిందని, పలు నిర్ణ యాల వల్ల రెండేళ్ల నుంచి నష్టాలను భారీగా తగ్గించుకున్నామని చెప్పారు. 2020లో ఆర్టీసీకి రూ.2,557 కోట్ల నష్టం ఉండగా, ఈ ఏడాది రూ.650 కోట్లకు నష్టం తగ్గిందన్నారు. ఈ ఏడాదిలో రూ.4,641 కోట్ల రెవెన్యూ వచ్చిందని వెల్లడించారు. 100 డేస్ చా లెంజ్, శ్రావణ మాసం చాలెంజ్ పేరుతో ఆదనపు ఆ దాయాన్ని సమకూర్చుకున్నామని, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ. 20.11 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 1000కి పైగా కొత్త బస్సులు వస్తాయని సజ్జనార్ తెలిపారు. ఉన్న వనరులను వినియోగించుకుని, ఆర్టీసీని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ఆర్టీసీ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు110 ప్లేస్ లను సెలక్ట్ చేశామని, 24 చోట్ల పనులు స్టార్ట్ అయ్యాయన్నారు.   

సింగరేణి దర్శిని బస్ ప్రారంభం  

సింగరేణి దర్శిని పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్ ను లాంచ్ చేసింది. మంగళవారం బస్ భవన్ లో ఈ బస్ ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం డీ సజ్జనార్, సింగరేణి డైరెక్టర్ బలరాం జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్​లోని ఎం జీబీఎస్, జేబీఎస్ నుంచి ఈ బస్ బయల్దేరి సిం గరేణి కాలరీస్​కు చేరుకుంటుంది. ప్యాకేజీలో భాగంగా సింగరేణిలోని అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్స్, జైపూర్ పవర్ ప్లాంట్​ను చూపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాసింజర్ కు రూ.1,600 చార్జీని ఖరారు చేశామన్నారు. ప్రస్తుతం ఒక బస్ నడుపుతున్నామని, ప్యాసింజర్ రెస్పాన్స్ ను బట్టి మరో 3బస్సులు నడుపుతామని తెలిపారు. త్వరలో కాళేశ్వరం టూర్, ఖమ్మంలోని కిన్నెరసాని టూర్ లకూ బస్సులు నడపుతామన్నారు.