దీప్కే విదేశీ విద్యకు డబ్బెక్కడిది..? ఈసీఐ, ట్యాక్స్అధికారులకు ఆర్టీఐ కార్యకర్త లేఖ

దీప్కే విదేశీ విద్యకు డబ్బెక్కడిది..? ఈసీఐ, ట్యాక్స్అధికారులకు ఆర్టీఐ కార్యకర్త లేఖ

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విదేశీ చదువుకు డబ్బు ఎలా సమకూరిందనే విషయంపై విచారణ జరిపించాలని సూరత్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారని తివారీ పేర్కొన్నారు. 

విశ్రాంత ఉద్యోగికి తన కొడుకును విదేశాల్లో చదివించేంత సొమ్ము ఎలా సమకూరిందనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని తన లేఖలో కోరారు. భగవాన్‌‌‌‌‌‌‌‌రావు దీప్కే ఆర్థిక పరిస్థితిని, ఆయన కొడుకు విదేశాలలో అభ్యసించిన ఉన్నత చదువుల ఆర్థిక వనరులను పరిశీలించాలన్నారు. 

ఈ విషయంపై ట్యాక్స్ అధికారులకూ తివారీ ఓ లేఖ రాశారు. రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీజేపీ.. నిధులు సేకరించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ ఫండ్‌‌‌‌‌‌‌‌పై కూడా ఎంక్వైరీ చేయాలని ఈసీని, ట్యాక్స్ అధికారులను తివారీ కోరారు.