సబలెంక రెండోసారి ..

సబలెంక  రెండోసారి ..

బెలారస్‌‌‌‌ స్టార్‌‌‌‌ అరీనా సబలెంక వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను కైవసం చేసుకుంది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో రెండోసీడ్‌‌‌‌ సబలెంక 6–3, 6–2తో 12వ సీడ్‌‌‌‌ జెంగ్ క్విన్‌‌‌‌వెన్‌‌‌‌ (చైనా)పై నెగ్గింది. విక్టోరియా అజరెంక (2012, 13) తర్వాత వరుసగా ఈ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ నెగ్గిన తొలి ప్లేయర్‌‌‌‌గా సబలెంక రికార్డులకెక్కింది. 

2000 తర్వాత ఒక సెట్‌‌‌‌ కూడా చేజార్చుకోకుండా గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ నెగ్గిన ఐదో ప్లేయర్‌‌‌‌గా నిలిచింది. గంటా 16 నిమిషాల మ్యాచ్‌‌‌‌ను సబలెంక తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ ఆటతో ఏకపక్షంగా మార్చేసింది. తొలిసెట్‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌లో జెంగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన సబలెంక 33 నిమిషాల్లోనే సెట్‌‌‌‌ను ముగించింది. రెండో సెట్‌‌‌‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్‌‌‌‌ చేసిన బెలారస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మిగతా గేమ్‌‌‌‌ల్లోనూ ఆధిపత్యాన్ని చూపెట్టింది.