కోల్‌కతా: దులీప్ ట్రోఫీలో టీమ్‌స్పిరిట్ మిస్సవుతోందని బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. వీలైనంత త్వరగా దీనిని సంస్కరించాలని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌గంగూలీని కోరాడు. ‘దులీప్‌ట్రోఫీలో టీమ్ బాండింగ్ కనబడటం లేదు. ఆటగాళ్లు టీమ్‌స్పిరిట్‌కంటే వ్యక్తిగత పెర్ఫామెన్స్‌పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఐపీఎల్‌వేలం లేదా టీ20, వన్డే టోర్నీలు ఉన్న నేపథ్యంలో… వీటిని దృష్టిలో పెట్టుకునే దులీప్‌మ్యాచ్‌లు ఆడుతున్నారు. అందుకే దీనిని పూర్తిగా సంస్కరించాలని దాదాను కోరుతున్నా’ అని మాస్టర్‌పేర్కొన్నాడు. ఈ టోర్నీని సంస్కరించడానికి సచిన్‌మంచి ఆలోచన కూడా చెప్పాడు. రంజీ తర్వాత జరిగే దులీప్‌ట్రోఫీలో అందరూ అత్యుత్తమ ప్లేయర్లు ఉండటం వల్ల పోటీతత్వం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘రంజీలో సెమీస్‌చేరిన నాలుగు జట్లతో పాటు మరో రెండింటిని అదనంగా తీసుకోవాలి. అర్హత సాధించని టీమ్‌ల్లోనూ టాలెంటెడ్‌ప్లేయర్లు ఉంటారు. వీళ్లతో పాటు అండర్, 23లో అద్భుతంగా రాణించిన వారికీ అవకాశం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ప్రతి టీమ్‌లో అత్యుత్తమ ఆటగాళ్లే ఉంటారు. అప్పుడు వ్యక్తిగత పెర్ఫామెన్స్‌తో పాటు టీమ్‌స్పిరిట్‌కూడా పెరుగుతుంది. పోటీ పెరిగితే నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులోకి వస్తారు’ అని చెప్పాడు.

