రాయ్ పూర్: రోడ్ సేఫ్టీ టీ20 వరల్డ్ సిరీస్ లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్-ఇండియా లెజెండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఇరగదీశాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ లో ప్రారంభంలోనే ఓపెనర్ వీరేంద్ర సేవ్వాగ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బద్రీనాథ్ తో కలిసి సచిన్ ఆచితూచి ఆడుతూ మ్యాచ్ ను ముందుకు సాగించాడు. అవసరమైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్ రేట్ పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో ( 60-9 ఫోర్లు,1సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 13వ ఓవర్లో ఔట్ అయినప్పటికీ టీమ్ స్కోర్111/2గా ఉంది.

