న్యూఢిల్లీ: తన బ్యాటింగ్ పొజిషన్‌పై అసంతృప్తితో ఉన్న లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్.. 2007లోనే కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అన్నాడు. అదే ఏడాది వన్డే వరల్డ్‌కప్ నుంచి ఇండియా లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టడంతో ఇది మరింత పెరిగిందన్నాడు. ‘ఆ టైమ్‌లో సచిన్ ఆటకు గుడ్‌బై చెబితే ఓ గ్రేట్ బ్యాట్స్‌మన్‌తో కోచింగ్ జర్నీని మిస్ అయ్యేవాడిని. వరల్డ్‌కప్ ముగించుకుని ఇండియాకు వచ్చిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని సచిన్ అనుకున్నాడు. ఆ టైమ్‌లో బ్యాటింగ్ పొజిషన్‌పై అసంతృప్తితో ఉండటంతో పాటు క్రికెట్‌ను ఆస్వాదించలేక ఇబ్బంది పడ్డాడు. ఆ పరిస్థితుల్లో నేను మాస్టర్‌కు ఎలాంటి కోచింగ్ ఇవ్వలేదు. కేవలం అతను పుంజుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని మాత్రమే క్రియేట్ చేశా. ఆ తర్వాత మూడేళ్ల కాలంలో సచిన్ 19 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడు. అతను కోరుకున్న బ్యాటింగ్ పొజిషన్లోకి వెళ్లాడు. ఆ తర్వాత మేం వరల్డ్‌కప్ కూడా గెలిచాం. బ్యాటింగ్, ఇతర అంశాల గురించి అతనికి నేను ఏమీ చెప్పలేదు. ఆట ఎలా ఆడాలో సచిన్‌కు బాగా తెలుసు. అతనికి కావాల్సిందల్లా సరైన ఎన్విరాన్మెంట్’ అని గ్యారీ చెప్పుకొచ్చాడు.

