డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్

డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్

డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లోని కొత్తకోటలో రేవంత్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.  బీజేపీ వాళ్లకు డీకే అరుణ వత్తాసు పలుకుతోందన్నారు. మోదీ,అమిత్ షాతో కలిసి తనను సీఎం కుర్చీ నుంచి దించడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కుర్చీ ఎక్కి 150 రోజులు కాలేదు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా..గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరన్నారు.

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తదన్నందుకు   తనపై కుట్ర పూరితంగా ఢిల్లీలో కేసు పెట్టారని చెప్పారు  రేవంత్ . తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ కు పంపించారని అన్నారు.  డీకే అరుణ మహబూబ్ నగర్ కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. డీకే అరుణ ప్రజలకు ఏమీ చెయ్యకున్నా ఆమె పదవులకు.. కర్ణాటకలో వ్యాపారాలకు మాత్రం ఢోకాలేదన్నారు రేవంత్.

డీకే అరుణతో తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీకే అరుణకు కాంగ్రెస్ ఏం అన్యాయం చేసింది. అరుణను మంత్రిని చేసింది కాంగ్రెస్సే కాదా?. అరుణకు గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణ అంటుంది..అరుణ దగ్గర ఏముంది గుంజుకోవడానికి. సీఎం పదవికన్నా పెద్ద పదవి అరుణ దగ్గర ఉందా? డీకే అరుణ ఏం చేసిందని..పాలమూరులో ఓటు అడుగుతుంది. గాడిద గుడ్డు ఇచ్చిన అరుణకు ఎందుకు ఓటెయ్యాలి. అరుణ  మా చెవుల పువ్వులు ఉన్నాయనుకుంటున్నావా అని రేవంత్ ధ్వజమెత్తారు.  

మహబూబ్ నగర్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.   మహబూబ్ నగర్ , నాగర్ కర్నూలులో  లక్ష మెజారిటీ ఖాయమన్నారు.   వారసత్వంగా తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.   వనపర్తిలో గెలుపు కోసం నేను గల్లీగల్లీ తిరిగా.  పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లిచ్చి ఆశీర్వదించారు. పాలమూరుకు మరోసారి ఇలాంటి అవకాశం రాదు.  70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండు. పాలమూరుకు సోనియాగాంధీ అత్యున్నత పదవిచ్చారు. సీఎం పదవి నుంచి నన్ను దించుతామని..ప్రభుత్వాన్ని కూలగొడుతాం అంటూ పిచ్చికూతలు కూస్తున్నారు.  రాజకీయాలు పక్కన పెట్టి జిల్లా అభివృద్దికి కలిసి రావాలని చెప్పానన్నారు రేవంత్.  

కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.   రుణమాఫీ చేసి పాలమూరు ప్రజల రుణం తీర్చుకోకపోతే  సీఎం కుర్చీ వృథా అని అన్నారు. తాను మాటిస్తే  తప్పబోనన్నారు.  సిద్దిపేటకు హరీశ్ శనిలాగ పట్టారని..రుణమాఫీ చేసి శనిని తొలగిస్తానని చెప్పారు.  మే 9న ప్రతీ రైతుకు రైతుభరోసా అందిస్తామని అన్నారు.