యంగ్ ఇండియా స్కూల్ నాణ్యతతో నిర్మించాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

యంగ్ ఇండియా స్కూల్ నాణ్యతతో నిర్మించాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
  • నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ 

కొల్లాపూర్, వెలుగు :  గురుకుల నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి  వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటపోలు గ్రామంలో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనులు ప్రభుత్వం నిర్ధేశించిన మ్యాప్, ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారమే జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని  రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకుల పాఠశాల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందనుందన్నారు. సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో విశాలమైన తరగతి గదులు, పాఠశాల భవనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

కేబుల్ బ్రిడ్జి నిర్మాణ స్థల పరిశీలన

తెలంగాణ–ఏపీ, రాష్ట్రాలను కలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. వంతెన నిర్మాణానికి, పరిపాలన అనుమతులు, భూసంబంధిత అడ్డంకులు తదితర అంశాలపై రెవెన్యూ, అటవీ, జాతీయ రహదారి శాఖల అధికారులను ఆరా తీశారు. తెలంగాణ భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగం వరకు 1077 మీటర్ల పొడవున ఈ హైబ్రిడ్ కేబుల్ వంతెనను ఈపీసీ విధానంలో నిర్మించనున్నారని తెలిపారు.

వంతెన అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గనుందని చెప్పారు. కల్వకుర్తి నుంచి ప్రారంభమయ్యే 167వ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణానది పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కూడా ప్రోత్సాహం లభించనుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో బన్సిలాల్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ ఇంజినీర్లు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.