- పీయూ వీసీ శ్రీనివాస్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన సౌత్ జోన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్ షిప్ పోటీలను వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనివర్సిటీలోని క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారిణులు ఈ నెల 21 నుంచి 23 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు, చెస్ కోచ్ ఆనంద్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ రజినితో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొన్నారు.
