నా కొడుకుని చూసి గర్వపడుతున్నా: వీరుడి మరణం వృధా కాదు: కల్నల్ సంతోష్ బాబు తల్లి

నా కొడుకుని చూసి గర్వపడుతున్నా: వీరుడి మరణం వృధా కాదు: కల్నల్ సంతోష్ బాబు తల్లి

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: దేశంకోసం తెలంగాణ బిడ్డ నేల కొరిగాడు.సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు. ఇండియా,చైనా సోల్జ ర్ల మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట కు చెందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు చనిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి జరగడంతో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. సంతోష్ మరణంతో సూర్యాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యు లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీఇచ్చారు

బాధగా ఉన్నా.. గర్వపడుతున్నా

దేశం కోసం పోరాడి నా కొడుకు సంతోష్ అమరుడయ్యాడు. తల్లిగా బాధగా ఉన్నా ఇండియన్ సిటిజన్ గా గర్వపడుతున్నా. దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి. ఉన్న ఒక్క కొడుకు చనిపోవడం ఎంతో బాధిస్తోంది. వీరుడి మరణం వృథా కాదు. – సంతోష్ తల్లి మంజుల

సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ లో ఉంటున్న బిక్కుమళ ఉ్ల పేందర్, మంజుల కొడుకు సంతోష్ బాబు. సంతోష్కు భార్యసంతోషి, కుమార్తె అభిజ్న(9), బాబు అనిరుధ్ (4) ఉన్నారు. సంతోష్ 1993లో 6వ తరగతిలో కోరుకొండ సైనిక్ స్కూల్ లో చేరారు. 2000 ఆర్మీలో చేరారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. 15 ఏళ్ల సర్వీస్ లో కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, పాకిస్థాన్ బోర్డర్  లో డ్యూటీ చేశారు. కొన్నాళ్లు కాంగో దేశంలో కూడా పని చేసి వచ్చారు. 37 ఏళ్ల వయసులో కర్నల్ గా పదోన్నతి పొంది ఇండియన్ ఆర్మీ లో రికార్డర్ నెలకొల్పారు సంతోష్ బాబు. 2007లో పాకిస్థాన్ బోర్డర్ లో  ముగ్గురు చొరబా టుదారులను అంతమొందించారు. ఏడాదిన్నరగా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నారు.

రేపు అంత్యక్రియలు

ప్రస్తుతం సంతోష్ భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. మృతదేహం గురువారం సూర్యాపేటకు తీసుకువ చ్చేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. సూర్యా పేట జిల్లాకేంద్రం లో సంతోష్ అంతక్రియలు నిర్వహించనున్నట్లు సమీప బంధువులు తెలిపారు. సంతోష్ మృతి గురించి తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.