Vijay-Rashmika : టాలీవుడ్​ ట్రెండింగ్​ జంట మరోసారి స్క్రీన్‌పై..థియేటర్స్లో ఆడియన్స్ ఎగిరి గంతేయాల్సిందే!

Vijay-Rashmika : టాలీవుడ్​ ట్రెండింగ్​ జంట మరోసారి స్క్రీన్‌పై..థియేటర్స్లో ఆడియన్స్ ఎగిరి గంతేయాల్సిందే!

టాలీవుడ్​ ట్రెండింగ్​ జంట విజయ్​ దేవరకొండ (Vijay Deverakonda),రష్మిక (RashmikaMandanna) మధ్య రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే రూమర్లు,ఎప్పుడు కొత్తగా అనిపిస్తాయి.అయితే ఈ క్రేజీ అంతా గీత గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించి ఆడియన్స్ మనసులో స్టార్ జోడిగా ఫిక్స్ అయ్యారు.ఇదిలా ఉంటే ఈ జోడి మరోసారి తెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. 

రీసెంట్ గా విజయ్‌ బర్త్డే స్పెషల్గా ‘టాక్సీవాలా’ ,‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మెప్పించిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో యోధుడిగా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..ఆసక్తికర పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.

ఈ పోస్టర్లో ఓ వీరుడి విగ్రహాన్ని చూపిస్తూ..శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ..అనే క్యాప్షన్ ఇచ్చారు.అంతేకాదు..1854 నుంచి 1873 సంవత్సరం మధ్య కాలంలో ఈ సినిమా కథ జరుగుతుందని పోస్టర్పై ప్రకటించారు.  

అయితే ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. VD14 అనే వర్కింగ్‌టైటిల్‌తో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండనుందట. అయితే, ఇలాంటి పాత్రకు రష్మిక అయితేనే బాగుంటుందని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్.

ఇదే కనుక నిజమైతే..విజయ్ రష్మిక జోడికి ఫ్యాన్స్ థియేటర్స్ లో సీట్ లో కూర్చోవడం కూడా కష్టమే. ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే, వీరిద్దరి మధ్య ఏం లేనప్పుడే అట్ట్రాక్ట్ అయినా ఆడియన్స్ కు, ఇప్పుడు అన్ని తెలిసాక ఉండగలరా?త్వరలో VD 14 నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.