లైంగిక దాడుల కేసులో ట్విస్ట్

లైంగిక దాడుల కేసులో ట్విస్ట్

  కర్ణాటక హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసులో ట్విస్ట్ జరిగింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు తనను బెదిరించారని.. బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించింది. తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వెల్లడించింది. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ప్ర కటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి స్పందించారు.  

కేసును దర్యాప్తు చేస్తున్నసిట్ అధికారులు బాధితులను  బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వా నికి అనుకూలంగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ బాధితుల తులపై సిట్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమే శ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభు త్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు.