
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 50 రోజుల జైలు జీవితం తర్వాత కేజ్రీవాల్ బయటకొచ్చారు. లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్లు కోర్టు వెల్లడించింది. జైలు నుంచి బయటకు రాగానే కేజ్రీవాల్‌కు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.