ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేసిండు : సీఎం రేవంత్రెడ్డి

ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేసిండు : సీఎం రేవంత్రెడ్డి

రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదు..తెలంగాణను ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో  పాలమూరు బిడ్డ లు కేసీఆర్ ను గెలిపిస్తే.. పార్లమెంటుకు పోయిండు..తెలంగాణ వచ్చినంక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు.. ఉమ్మడి పాలకులకంటే కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు ఎక్కువ ద్రోహం చేసిండని విమర్శించారు. అందుకే బీఆర్ ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే పూర్తి కాకుండా ఉన్నాయన్నారు. పాలమూరు వలస బిడ్డల బతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను  ప్రజల ఆశీర్వాదంతోటి  ముఖ్యమంత్రి ని అయ్యా..తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను మీబిడ్డగా తీసుకున్నా  అని ప్రజలనుద్దేశించి అన్నారు రేవంత్ రెడ్డి. 

బీజేపీ నేత డీ కే అరుణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. డీకే అరుణను  జెడ్పీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇయ్యాల  డీకే అరుణను ప్రజలు గుర్తు పడుతున్నారంటే అది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ అన్నారు. నమ్మిన పార్టీని, మోసిన కార్యకర్తలకు అన్యా యం చేసి డీకే అరుణ శత్రువు పక్కన చేరిందన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తా.. రేవంత్ రెడ్డిని పడగొడ్తానని సవాల్ చేస్తుందన్నారు. 70 యేళ్ల తర్వాత పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే.. డీకే అరుణ బొడ్డు కత్తి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా అంటే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు.