రంగారెడ్డి జిల్లాలో 962 నామినేషన్లు

 రంగారెడ్డి జిల్లాలో 962 నామినేషన్లు

చేవెళ్ల, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలి వచ్చి నామినేషన్లను సమర్పించారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో (ఆమన్​గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి) 3 రోజుల్లో కలిపి  962 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

నేడు నామినేషన్ల పరిశీలన ఉండగా..  ఫిబ్రవరి 1న అప్పీళ్లు  ,  ఫిబ్రవరి 2న అప్పీళ్లపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు రిటర్నింగ్ అధికారులు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.  11న పోలింగ్ జరగనుంది.