లోక్ సభలో రచ్చ.. రాహుల్ vs రాజ్ నాథ్ సింగ్

లోక్ సభలో రచ్చ.. రాహుల్ vs రాజ్ నాథ్ సింగ్

 లోక్ సభలో  గందరగోళం నెలకొంది. అధికార పార్టీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా..చైనాతో  సరిహద్దు ఇష్యూను ప్రస్తావించిన   రాహుల్ గాంధీ  కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని ఓ వ్యాఖ్యాన్ని రాహుల్ ప్రస్తావించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

 రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా అభ్యంతరం తెలిపారు.  పుస్తకం సోర్స్ ఏంటో రాహుల్ చూపించాలన్నారు.అనంతరం కల్గజేసుకున్న స్పీకర్ రాహల్ మైక్ కట్ చేసి..  సభలో సబ్జెక్ట్ మాట్లాడాలని..రాహుల్ చెప్పిన పుస్తకం ఎక్కడుందని ప్రశ్నించారు. పుస్తకం పబ్లిష్ చేయకుండా అడ్డుకున్నారన్న రాహుల్ ..  కేంద్రం నుంచి ఏం జావాబు వస్తుందో వినేందుకే ఈ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. 

సభలో పేపర్ కటింగ్స్,పుస్తకాలు, ఫ్లెక్సీలు,ప్లకార్డులు  నిషేదమని రూల్ బుక్ లో ఉందని స్పీకర్ బదులిచ్చారు. పుస్తకం ప్రామాణికత ఏంటో చెప్పాలన్నారు. మీరు రూల్స్ అతిక్రమించొద్దని రాహుల్ కు సూచించారు. రాహుల్ చెప్పింది అసత్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మేగజైన్ లోని కొటేషన్లు సభలో చదవొద్దని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దీంతో కాంగ్రెస్,బీజేపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది.