బైక్ ను ఢీ కొట్టిన ట్రక్కు..ఆరేళ్ల బాలుడు మృతి

బైక్ ను ఢీ కొట్టిన ట్రక్కు..ఆరేళ్ల బాలుడు మృతి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బుగ్గరామేశ్వర ఆలయం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  అదుపు తప్పిన లారీ బైక్ ను ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ఆరు సంవత్సరాల బాలుడు రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందగా..ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 ఈ ఘటనలో రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటన స్థలానాన్ని పరిశీలించిన  వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చెయ్యడంతో ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.ప్రమాదంతో బాలుడి కుటుంబ  సభ్యులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.