ఇండియా, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 5 రోజుల్లో టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. అదే రోజు సాయంత్రం టీమిండియా తమ తొలి మ్యాచ్ లో యూఎస్ఏ తో ఆడుతుంది. అంతకంటే ముందు అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లతో బిజీ కానున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు.
మొత్తం మూడు వార్మప్ మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇండియా ఫిబ్రవరి 4 న సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇండియా వరల్డ్ కప్ లో ఆడబోయే లీగ్ మ్యాచ్ కు మూడు రోజుల ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అమెరికా, నమీబియాలతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ల కోసం సీనియర్ జట్టు కాకుండా ఇండియా 'ఏ' జట్టు ఆడనుంది. బీసీసీఐ భారత 'ఏ' జట్టును సోమవారం (ఫిబ్రవరి 2) ప్రకటించింది. భారత ఏ జట్టుకు బదోనీ కెప్టెన్సీ చేయనున్నాడు. స్క్వాడ్ లో తిలక్ వర్మను కూడా ఎంపిక చేశారు.
►ALSO READ | Under 19 World Cup 2026: వరల్డ్ కప్ సెమీస్ షెడ్యూల్ ఇదే.. టీమిండియా ప్రత్యర్థి ఎవరు.. మ్యాచ్ ఎప్పుడంటే..?
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిలక్ వర్మ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సిన అవసరం ఉందని భావించిన సెలక్టర్లు ఈ తెలుగు కుర్రాడికి స్క్వాడ్ లో అవకాశం ఇచ్చారు. నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఉర్విల్ పటేల్, పరాగ్ జట్టులో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన రవి బిష్ణోయ్ ని ఎంపిక చేశారు. మానవ్ సుతార్, విప్రజ్ నిగమ్ రూపంలో ఇద్దరు స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లతో పేస్ విభాగాన్ని ఎంపిక చేశారు. సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా 'ఏ' యూఎస్ఏ తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
ఇండియా ఎ ఫిబ్రవరి 2 న అమెరికాతో.. ఫిబ్రవరి 6న అమెరికాతో తలపడుతుంది. జియో హాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోవార్మప్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఎటువంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడవు. ఈ మూడు జట్లు వరల్డ్ కప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ ఒక్కొక్క వార్మప్ మ్యాచ్ ఆడతాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడుతూ టీమిండియా బిజీగా ఉంది. శనివారం (జనవరి 31) తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగుస్తుంది. నాలుగు రోజుల తర్వాత భారత జట్టు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్ లో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న యూఎస్ఏ తో ఆడనుంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 వార్మప్‌ల కోసం భారత 'A' జట్టు:
ఆయుష్ బదోని (కెప్టెన్), నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్
The BCCI has announced India A’s squad for the upcoming T20 World Cup 2026 warm-up fixtures.
— CricTracker (@Cricketracker) February 2, 2026
Ayush Badoni will lead the side, while Tilak Varma is the only member from India’s official T20 World Cup squad set to get game time ahead of the tournament. #T20WorldCup2026… pic.twitter.com/kbYKQN3Iqk
