స్విమ్మింగ్ పూల్‌‌‌‌లో జాగ్రత్త

స్విమ్మింగ్ పూల్‌‌‌‌లో జాగ్రత్త

సమ్మర్ లో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఈత నేర్చుకోవడానికి,సరదా కోసం చిన్నారులు, యువకులు, పెద్దలనే తేడా లేకుండా వస్తుంటారు. ఈ సీజన్లో స్విమ్మింగ్ పూల్స్ ఫుల్ బిజీగా ఉంటాయి. మరికొన్ని రోజుల్లో స్కూల్ స్టూడెంట్స్ కి సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. హాలిడేస్ లో పిల్లలు స్విమ్మింగ్ పై ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. వారిఉత్సాహన్ని కాదనలేక పేరెంట్స్ స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వారిని స్విమ్మింగ్ పూల్ వద్దకి పంపిస్తారు. కానీ ఈ స్విమ్మింగ్ పూల్స్ లో సరైన సేఫ్టీ లేకపోవడంతో ఇటీవల కాలంలో చిన్నారులు ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. సమ్మర్ జిజినెస్ అంటూ కొంతమంది స్విమ్మింగ్ పూల్స్ నిర్మించి..ఎలాంటి సేఫ్టీ, కనీస సౌకర్యాలు,సూచనలు పాటించకుండా చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవలస్విమ్మింగ్ పూల్ లో పడి చిన్నారులు, మైనర్ లు చనిపోయిన ఘటనలు ఉన్నాయి.

మేడిపల్లి, రాజేంద్రనగర్ లోరాజస్థాన్ కి చెందిని భగవాన్ భాయ్(16) హోలీపండుగ రోజు సిటీలోని బేగంబజార్ లోని తనబంధువుల ఇంటికి వచ్చాడు. పండుగ రోజు తనబంధువులతో కలిసి క్రికెట్ ఆడేందుకు మేడిపల్లి పీఎస్ పరిధిలోని కాచవనిలో బాబూరావు స్టేడియానికి వెళ్లాడు. బంధువులు క్రికెట్ ఆడుతుండగా..బాబురావు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లాడు. ఈతరాకపోవడంతో బాబూరావు నీటిలో మునిగి చనిపోయాడు. అదేవిధంగా ఫిబ్రవరిలో రాజేంద్రనగర్ లోస్విమ్మింగ్ పూల్ లో మునిగి మహ్మద్ ఖాజా అనేబాలుడు చనిపోయాడు. ఆ స్విమ్మింగ్ పూల్ వద్దకోచ్ లేకపోవడం వల్లే మహ్మద్ ఖాజా చనిపోయాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.ఈ రెండు ఘటనల్లోనూ స్విమ్మింగ్ పూల్స్ వద్దకోచ్ లు లేకపోవడం, నిర్వాహకుల నిర్లక్ష్యంవహించినట్టుగా తెలుస్తోంది. సేఫ్టీ బెలూన్స్, లైఫ్ జాకెట్లు ఈత నేర్చుకునే వారు నీటి మధ్యలోకి వెళ్లి అలసిపోయినప్పడు మధ్యలో ఉండాల్సిన సేఫ్టీ బెలూన్స్, వారికి ఇవ్వాల్సిన లైఫ్ జాకెట్లు కూడా మెయింటైన్ చేయని స్వి మ్మింగ్ పూల్స్ సిటీలో, శివారుప్రాంతాల్లో కలిపి 50 శాతం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూల్స్ ప్రకారం 24 గంటలు స్విమ్మింగ్ పూల్ లోని నీటిని శుద్ధి చేసే మెషీన్లు ఉండాలి. ప్రతి రోజూ నీటిని మారుస్తూ..క్లోరిన్ తోశుద్ధి చేయాలి . కానీ కొన్ని స్విమ్మింగ్ పూల్స్ లో ఇలాంటివి జరగడం లేదు.మరి కొన్ని స్విమ్మింగ్ పూల్స్ లో నీటి శుద్ధి పై అవగాహన లేక ఎక్కువ మోతాదులో క్లోరిన్ కలుపుతున్నారు. ఇలాంటి నీటిలో స్విమ్మింగ్ చేసిన చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నారు. జాగ్రత్తలు ఇవే..స్విమ్మింగ్ పూల్ విస్తీర్ణాన్ని బట్టి ఎంతమందిని అనుమతించాలి.. చిన్నారులకు సేఫ్ గా స్విమ్మింగ్ ఎలా నేర్పించాలనే అవగాహన ట్రైనర్స్ కి ఉండాలి. ఈతరాని పిల్లలకు తప్పకుండా లైఫ్ జాకెట్లు అందించి వాటిని వారు వేసుకునేలా చూడాలి. సరైన ట్రైనర్స్ కి సేఫ్టీ విషయంలో అన్నిరూల్స్ తెలిసి ఉంటాయి. రూల్స్ పాటించకుండా..సరైన ట్రైనర్స్ లేకుండా స్విమ్మింగ్ పూల్ ని నిర్వహిస్తే చిన్నారులకు భద్రత లేనట్టే అని తల్లిదండ్రులు గుర్తించాలి.