V6 News

ఏఐ వాడకంపై సంభూతి లెర్నింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

ఏఐ వాడకంపై సంభూతి లెర్నింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్కూళ్లలో ఏఐ వాడకంపై అవగాహన కల్పించేందుకు సంభూతి లెర్నింగ్ సంస్థ హన్మకొండలో ప్రత్యేక వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి సుమారు 80 మందికి పైగా పాఠశాల యజమానులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

‘విద్యాబుద్ధి’ అనే ఏఐ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ద్వారా పాఠాల ప్రణాళిక, మూల్యాంకనం ఎంత సులభమో సంస్థ ప్రతినిధులు వివరించారు. ఏఐ ద్వారా కస్టమైజ్ చేసి విద్యను అందించడం భవిష్యత్తులో తప్పనిసరని సంభూతి లెర్నింగ్ సీటీఓ శ్రీనివాసరావు పొలాడి పేర్కొన్నారు.