5వ టీ20 మస్తు వెరైటీ: సేమ్ సీన్ రిపీట్

5వ టీ20 మస్తు వెరైటీ: సేమ్ సీన్ రిపీట్

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్ –భారత్ టీ20 సిరీస్ ఏ టైంలో మొదలైందో కానీ.. అన్నీ  రికార్డులు, థ్రిల్లింగ్ సంఘటనలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 2 సూపర్ ఓవర్ మ్యాచ్ లు కావడంతో క్రికెట్ చరిత్రలోనే ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో మరో సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. ఈ సారి సేమ్ ఓవర్..సేమ్ బాల్స్, సేమ్ బ్యాట్ మెన్, బౌలర్, క్యాచ్ పట్టింది.. ఇలా అన్నీ ఒకేలా జరిగిపోయాయి.

ఓపెనర్ గా లోకేష్ రాహుల్, సంజు శాంసన్ వచ్చారు.  అయితే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేపటికే శాంసన్‌ పెవిలియన్‌ చేరాడు. 1.03ఓవర్ లో కుగ్‌లీన్ వేసిన బౌలింగ్ లో శాంసన్ ఔట్ అయ్యాడు. సాన్‌ట్నర్ క్యాచ్ పట్టాడు. అయితే 4వ టీ20లోనూ సంజు శాంసన్ 1.03ఓవర్, కుగ్‌లీన్ బౌలింగ్, సాన్‌ట్నర్ క్యాచ్ పట్టాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యింది. భారత్- న్యూజిలాండ్ సిరీస్ లో ఇలా వెరైటీ సెన్సేషనల్ రికార్డులు బద్దలు కొట్టాయంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.