హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మెట్రోలో L&T వాటాలను స్వాధీనం చేసుకుంది. దీంతోL&T మెట్రోపై 100 శాతం ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. 2026 ఏప్రిల్ 30న 15 వేల కోట్ల రూపాయల డీల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం దీసుకుంది.
మెట్రో పూర్తి వాటాను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. మెట్రో బోర్డులో కీలక అధికారులను నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావును నియమించింది. డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
ఈ డీల్ తో మెట్రో ఫేజ్ 2 లో విస్తరిణకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2ఏ అండ్ 2బీలో 163 కి.మీ. కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదించింది. ఫేజ్-2 అప్రూవల్ కోసం ఎల్ అండ్ టీ తో డిఫినిటివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది. ఎల్ అండ్ టీ.. ఫేజ్-2లో ఈక్విటీ పార్టనర్‌గా పాల్గొనలేమని స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి – ఫేజ్-1, ఫేజ్-2 ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సంస్థకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం టేకోవర్ చేయాలని ప్రతిపాదించింది. ఫేజ్-1 ప్రాజెక్ట్ అప్పు రూ.13 వేల కోట్లు రాష్ట్రం భరిస్తుందని అంగీకారం తెలిపింది. ఈక్విటీ విలువ రూ.2 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ టేకోవర్ షరతులు పరస్పర చర్చలతో ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో ఎల్ అండ్ టీ వాటాను మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఆధీనంలో మెట్రో నడుస్తుంది.

