V6 News

జియో హాట్ స్టార్లో నివిన్ పౌలీ ప్రతిఛాయ సినిమా.. చూడొచ్చా..? టైం వేస్టా..?

జియో హాట్ స్టార్లో నివిన్ పౌలీ ప్రతిఛాయ సినిమా.. చూడొచ్చా..? టైం వేస్టా..?
  • టైటిల్: ప్రతిఛాయ
  • ప్లాట్​ ఫాం: జియో హాట్ స్టార్
  • డైరెక్షన్:  బి ఉన్నికృష్ణన్
  • కాస్ట్: నివిన్ పౌలీ, బాలచంద్ర మీనన్, సబితా ఆనంద్, షరాఫుద్దీన్, నీతూ కృష్ణ, విష్ణు అగస్త్య, నిశాంత్ సాగర్

కేరళ ముఖ్యమంత్రి వర్గీస్(బాలచంద్ర మీనన్) నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతని పెద్ద కొడుకు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి వస్తాడు. రాజకీయాలంటే  ఇష్టం లేని అతని చిన్న కొడుకు జాన్ వర్గీస్ (నివిన్ పౌలీ) ఐటీ రంగంలో సెటిల్‌‌‌‌ అవుతాడు. సీఎం ఒకసారి ‘హోటళ్లలో మద్యం వద్దు’ అనే సాహసోపేతమైన విధానాన్ని ప్రతిపాదిస్తాడు.

అదే టైంలో వర్గీస్‌‌‌‌ తనని లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తుంది. దాంతో వర్గీస్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. తండ్రిపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించేందుకు జాన్ రంగంలోకి దిగుతాడు. ఐటీ ప్రొఫెషన్‌‌ని వదిలి తండ్రి కోసం రాజకీయాల్లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వర్గీస్ అవినీతిపరుడా? మంచివాడా?  తెలియాలంటే సినిమా చూడాలి.