కొన్ని నెలల క్రితమే విడాకులు.. ఎట్టకేలకు మౌనం వీడిన సానియా మీర్జా

కొన్ని నెలల క్రితమే విడాకులు.. ఎట్టకేలకు మౌనం వీడిన సానియా మీర్జా

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ మోడల్, నటి అయిన సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. వీరి పెళ్లి ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై నిన్న సానియా స్పందించకపోయినా.. తాజాగా మాలిక్ తో తన విడాకుల గురించి కీలక విషయాలు వెల్లడించింది.       

సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా ఎట్టకేలకు స్పందించింది. నివేదికల ప్రకారం కొన్ని నెలలకే వీరు   విడాకులు తీసుకున్నారని సానియా మీర్జా తెలియజేసింది. మాలిక్ తన మూడో వివాహ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న ఒక రోజు తర్వాత సానియా ఈ వ్యాఖ్యలు చేసింది. తన కూతురు షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చిందని సానియా తండ్రి నిన్న (జనవరి 20) న వెల్లడించారు. ప్రస్తుతం సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బిజీగా ఉంది. మరో వైపు షోయబ్ మాలిక్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2024లో ఆడుతున్నాడు.

2010లో మొదట భార్య అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్ అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2018లో ఇజాన్ అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై వీరు ఏనాడూ స్పందించింది లేదు. అవన్నీ పుకార్లే అనేలా పైకి కనపించేవారు. ఈ మధ్యనే ఈ జంట తమ కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఇంతలోనే ఏమయ్యిందో కానీ, షోయబ్ మరొకరిని పెళ్లాడానని చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.