షోయబ్‌‌‌‌‌‌‌‌కు సానియా శుభాకాంక్షలు

షోయబ్‌‌‌‌‌‌‌‌కు సానియా శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌‌‌‌‌‌‌తో  విడాకులు తీసుకున్న విషయాన్ని సానియా మీర్జా కన్ఫామ్ చేసింది. కొన్ని నెలల కిందటే తాము విడిపోయామని వెల్లడించింది. పాక్ నటి సనా జావేద్‌‌‌‌‌‌‌‌ను పెండ్లి చేసుకున్న  షోయబ్‌‌‌‌‌‌‌‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సానియా కుటుంబం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 ‘సానియా తన పర్సనల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ను ఎప్పుడూ  పబ్లిక్‌‌‌‌‌‌‌‌కు దూరంగానే ఉంచుతుంది. షోయబ్ నుంచి ఆమె కొన్ని నెలల కిందటే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఈ రోజు అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. కొత్త  ప్రయాణం ప్రారంభించిన షోయబ్‌‌‌‌‌‌‌‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. సానియా జీవితంలో ఇది చాలా సున్నితమైన సమయం. కాబట్టి అభిమానులు,  శ్రేయోభిలాషులు ఎలాంటి పుకార్లు, ఊహాగానాలను సృష్టించకుండా ఆమె ప్రైవసీని కాపాడాలని రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నది.