V6 News

కాకా చివరి శ్వాస వరకు కాలేజీ గురించే ఆలోచించిన్రు : సరోజా వివేక్

కాకా చివరి శ్వాస వరకు కాలేజీ గురించే ఆలోచించిన్రు : సరోజా వివేక్

పేద విద్యార్థుల కోసం విద్యా సంస్థను ప్రారంభించిన వెంకటస్వామి చివరి శ్వాస వరకు దాని గురించే ఆలోచించారని కాకా అంబేడ్కర్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. అంబేడ్కర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఉద్దేశంతో 50 ఏండ్ల క్రితం కాకా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యా సంస్థల బాధ్యతలు నిర్వహిస్తున్న తాను వెంకటస్వామి కోడలిగా గర్వపడుతున్నానని సరోజా వివేక్ అన్నారు. 

అంబేడ్కర్ విద్యా సంస్థల్ని యూనివర్సిటీగా మార్చాలని కాకా కలలు కనే వారని, దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సరోజా వివేక్ చెప్పారు. ప్రస్తుతం క్యాంపస్లో ఐదు కాలేజీలు ఉన్నాయని త్వరలోనే డీమ్డ్ యూనివర్సిటీగా మారుతుందని ఆశిస్తున్నామని అన్నారు. 80శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్కు తమ విద్యా సంస్థల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు సరోజా వివేక్ స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.