సట్టా బెట్టింగ్ రాకెట్ అరెస్ట్

సట్టా బెట్టింగ్ రాకెట్ అరెస్ట్

సికింద్రాబాద్: కొన్ని రోజులుగా సీక్రెట్ గా బెట్టింగ్ నిర్వహిస్తున్న రాకెట్ ను పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మంగళవారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. విశ్వనీయ సమాచారంతో చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి మెట్టుగూడలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. నిందితుల నుండి రూ. 47 వేల 300 స్వాధీనం చేసుకున్నారు. అలాగే సట్టా బెట్టింగ్ చిట్స్06, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. నిందితులు సదాశివ నవీన్ (సట్టా ఆర్గనైజర్), బొజ్జ గోపి (సబ్ ఆర్గనైజర్)తోపాటు నలుగురు పంటర్లు.. ఆకుల శ్రీనివాస్, సతీష్ కుమార్, కైరంకొండ నర్సింగ్ రావు, యాదగిరిలను అరెస్టు చేసినట్లు తెలిపారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్