జూలై 26న ‘సేవ్ మణిపూర్’ ఆందోళన.. :సీపీఐ నేత నారాయణ

జూలై 26న ‘సేవ్ మణిపూర్’ ఆందోళన.. :సీపీఐ నేత నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: మణిపూర్ రాష్ట్రానికి మద్ద తుగా ‘సేవ్ మణిపూర్’పేరుతో ఈ నెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతామ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపా రు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కుట్రలకు మణిపూర్ మండిపోతోందని ఆరోపిం చారు. 

మైతి, కుకి తెగలకు మధ్య కొట్లాట పె ట్టి.. కార్పొరేట్ వ్యవస్థలకు భూములు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. 55 వేల ఎకరాల భూమిని ఆదానికి ఇచ్చారన్నారు. మణిపూర్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించడాన్ని ఖండిస్తున్నామన్నారు.