బ్రేకప్ బాధకు ప్యాకప్ చెప్పండిలా..

బ్రేకప్ బాధకు ప్యాకప్ చెప్పండిలా..

ప్రేమ ఒక అందమైన ఫీలింగ్‌ .. ప్రతీ ఒక్కళ్లూ ఏదో ఒక దశలో ఆ అనుభూతిని ఫీలయ్యే ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు అంతా కొత్తగా కనిపిస్తుంది..ఎక్కడాలేని ఆనందమంతా ముఖంలోనే కనిపిస్తుంది. రోజులన్నీ నిమిషాల్లా గడిచిపోతాయి.. ప్రేమలో ఉన్నంతసేపు అంతా పాజిటివ్‌ గానే ఉంటుంది.కానీ, ఏదైనా కారణంతో విడిపోతేనే అసలు సమస్య. బ్రేకప్ అవ్వగానే లోకమంతా శూన్యం . అప్పటి వరకు చాలా సంతోషంగాఉన్న వాళ్లే.. బ్రేకప్ అవ్వగానే డీలా పడిపోతారు. తమ జీవితం అయిపోయిం దని డిప్రెషన్‌ లోకి వెళ్లిపోతుంటారు. దీన్నుంచి బయటకు రావడానికి చాలా మార్గా లున్నాయి.

ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిం చినప్పుడు , మనఃస్ఫూర్తిగా ఇష్ట పడినప్పుడు ఉన్నట్టుండి సింపుల్‌ గా వారి నుంచి విడిపోలేం. బ్రేకప్ అనేది చాలా మామూలు విషయమే. దానివల్ల కలిగే బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఆ బాధ మర్చిపోవడం చాలా కష్టం . ఆ బాధ ప్రతి రోజు నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఇది రోజువారీ జీవితం మీద కూడా ప్రభావం చూపించొచ్చు. ‘నాకే ఎందుకు ఇలా జరిగింది? నేనేం తప్పు చేశాను?’ అనే ఫీలిం గ్ బాగా వేధిస్తుంది. నిజంగా బ్రేకప్‌‌కు అంతలా ఫీల్ అవ్వాలా? దాన్నుంచి బయట పడే మార్గా లే లేవా?

టైం పట్టొచ్చు

రిలే షన్‌ లోకి ఎంటర్ అవ్వడం ఎంత కష్టమో బయటకు రావడం కూడా అంతే కష్టం . అది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కొంత టైం పడుతుంది. అందుకే బ్రేకప్ బాధ నుంచి త్వరగా బయటపడాలని కోరుకోకుం డా వీలైనంత టైం తీసుకోవాలి. మనసుకు మెల్లగా సర్ది చెప్పాలి. నచ్చిన పనులతో సమయాన్ని గడపాలి. కాస్త టైం పట్టినా అల్టిమేట్‌ గా మార్పు వచ్చితీరుతుంది. అందుకే బ్రేకప్ తర్వాత తొందరపాటు పనికిరాదు. వీలైనంత టైం తీసుకు ని మెల్లగా మామూలు స్థితికి రావాలి.

ఫ్రెండ్స్‌‌దే ‘కీ రోల్’

బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి స్నేహితులదే కీ రోల్. మనసులో బాధను అలాగే పెట్టుకుం టే పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆత్మీయులు, స్నేహితులతో దాన్ని పంచుకుం టే.. వాళ్ల మాటలు కొంత రిలీఫ్ కలిగించొచ్చు. ఈ బాధంతా కొంతకాలమే అని మనకు తెలిసినా దాన్ని ప్రతిసారి గుర్తుచేసేం దుకు ఒక మంచి ఫ్రెండ్ పక్కనుండాలి. అప్పుడే బాధను మర్చిపోగలం. ఫ్రెండ్స్‌ తో మనసులోని బాధంతా చెప్పుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది.

సెల్ఫ్ కేర్

బ్రేకప్ గురిం చే ఆలోచిస్తూ కూర్చోకుం డా సెల్ఫ్ కేర్ గురిం చి ఆలోచిం చాలి. మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో ఆలోచిం చాలి. ఏవైనా కొత్త మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు..ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఎప్పటి నుంచో చేద్దామనుకుం టూ వాయిదా వేస్తు న్న పనుల్ని ఇప్పుడు చేయెచ్చు. అలాగే రోజువారి పనుల్లో కొత్త వాటిని చేర్చాలి. వ్యాయామం చేయడం, హెల్త్ కేర్, బ్యూటీకేర్ లాం టివి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయెచ్చు. కొన్ని రోజులు ఏదైనా టూర్‌‌‌‌కి వెళ్లి రావొచ్చు. దానివల్ల కొత్త ఎనర్జీ వస్తుంది. ఇలా ఏదో ఒక నచ్చిన పనితో నిమగ్నమవడం వల్ల టైం తెలీదు. పాత విషయాలు కూడా అంతగా గుర్తుకు రావు.

ఈ తప్పులొద్దు

  • చాలామంది బ్రేకప్ అవ్వగానే బ్రేకప్‌‌కు సంబంధిం చిన పోస్ట్‌‌లను సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీనివల్ల నష్టమే తప్ప లాభముండదు. బాధలో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టుల కన్నా నెగెటివ్ పోస్టులే ఎక్కువ. బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ లాంటి పోస్టులు ఇంకా ఎక్కువ. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండడం బెటర్.
  • పాత రిలే షన్‌ ను మరిచిపోవాలంటే వెంటనే కొత్త రిలే షన్‌ మొదలుపెట్టమని కొంతమంది సలహాలిస్తుంటారు. కానీ అదొక బ్యాడ్ ఐడియా. అలాం టి సలహాలు పట్టించు కోవద్దు. కొత్త రిలే షన్ దానంతట అది ఏర్పడాలే కానీ, బాధ నుంచి తప్పించు కోవడం కోసం రిలే షన్‌ లోకి ఎంటర్ అవ్వకూడదు. అలా చేస్తే ఆ రిలే షన్ కూడా ఎక్కువకాలం నిలవదు.
  • జరిగి పోయిన దాని గురిం చి పదేపదే ఆలోచిం చకూడదు. ‘నాకే ఎందుకిలా జరిగింది,అలా జరగకపోయి ఉంటే బాగుం డేది’. అంటూ జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం.
  • బ్రేకప్ అవ్వగానే చాలామంది వ్యసనాలకు అలవాటు పడిపోతారు. దాని వల్ల జీవితానికి మరిం త నష్టం కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.మనసు పాడైందని.. ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం మంచి సొల్యూషన్ కాదు.
  • బాధలోఉన్నప్పుడు చాలామంది లోన్లీగా ఉండాలనుకుం టారు. ఏకాం తంలో కూర్చొని ఎక్కడాలేని బాధ అంతా తమకే వచ్చిం దంటూ ఏడుస్తుంటారు. దానికి బదులు బయటికి వెళ్లి కొత్త ప్లేసు లను చూసినా, కొత్త వ్యక్తులను కలిసినా.. మనసులో తెలియని కొత్త ఉత్సాహం మొదలవుతుంది. పాత ఆలోచనలు పక్కకు పోయి కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. అవి జీవితాన్ని పాజిటివ్‌‌గా మారుస్తాయి.

గుర్తులొద్దు

బ్రేకప్ అవ్వగానే చాలామంది తమ ‘ఎక్స్ ’ ఫొటోలను ముందు పెట్టు కుని బాధ పడుతుంటారు. సినిమాల్లో చూపిం చినట్టు గా వాళ్లిచ్చిన గిఫ్ట్‌‌లను దగ్గర పెట్టు కుని ఏడుస్తుంటారు. ఇవన్నీ ప్రాక్టికల్‌ గా కుదిరే పనులు కావు. విడిపోయిన వాళ్ల వస్తువులు చూస్తూ కూర్చోవడం వల్ల ఎలాం టి ఉపయోగం ఉండదు. అందుకే బ్రేకప్ అవ్వగానే అలాంటి గుర్తులను చెరిపేయడం మంచిది.

 

say packup for your breakup trouble .