స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) డోర్ స్టెప్ బ్యాంకింగ్ ప్రారంభించింది. 70 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఇంటికే పరిమితమైన రోగులు, అంధులకు SBI లో అకౌంట్ ఉంటే ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సేవలు కొన్ని బ్రాంచులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. పూర్తి కేవైసి ఉన్న అకౌంట్ హోల్డర్లకు, అది కూడా ఆ హోమ్ బ్రాంచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు అందుతాయి. జాయింట్ అకౌంట్, మైనర్ అకౌంట్, నాన్ పర్సనల్ అకౌంట్లకు ఈ సేవలు వర్తించవు. SBI డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందేందుకు కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఇంటి నుంచి కదల్లేని వారు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నగదు జమ చేయాలన్నా, నగదు డ్రా చేయాలన్నా సేవలు పొందవచ్చు. క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికమ్, ఫామ్ 15 హెచ్ పికప్, కేవైసి డాక్యుమెంట్ పికప్స్, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికేట్ పికప్ వాటి కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. మనీ డిపాజిట్, విత్‌డ్రా లిమిట్ రోజుకు రూ.20వేలు మాత్రమే. అర్హులైన వినియోగదారులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.100 ప్లస్ జిఎస్‌టి, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కు రూ.60 ప్లస్ GST చెల్లించి ఈ సేవలు పొందవచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, అంధుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గతంలోనే అన్ని బ్యాంకుల్ని కోరింది. దీంతో SBI డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవల్ని ప్రారంభించింది.
