ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

కేంద్ర మంత్రి రమేశ్ ​పోఖ్రియాల్ స్పష్టత
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రీఓపెన్ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై క్లారిటీ కోసం దాదాపు 33 కోట్ల మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా హ్యూమన్ రిసోర్స్‌ డెవలప్‌మెంట్ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్‌ స్పష్టత ఇచ్చారు. స్కూల్స్‌, కాలేజీలు ఆగస్టు తర్వాతే రీఓపెన్ అవుతాయని ఆయన చెప్పారు. ఇంతకు ముందు జరిగిన పరీక్షలతోపాటు ఇప్పుడు నిర్వహిస్తున్న ఎగ్జామ్ రిజల్ట్స్‌ను ఆగస్టు 15లోగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

రిపోర్ట్స్ ప్రకారం.. స్కూల్స్, కాలేజీలను 30 శాతం అటెండెన్స్‌తో జులైలో రీఓపెన్ చేస్తారని, 8వ తరగతిలోపు చదువుతున్న స్టూడెంట్స్ ఇళ్ల వద్దే ఉంటారని భావించారు. అలాగే గ్రీన్, ఆరెంజ్ జోన్స్‌లోనూ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మళ్లీ తెరుస్తారని.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తక్కువ అటెండెన్స్‌తో రెండు షిఫ్ట్స్ మధ్య వాటి నిర్వహణ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రీఓపెన్ ఆలస్యమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, జులై 1 నుంచి 15వ తేదీ వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్‌సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. జులై 26న నీట్, అదే నెల 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.