విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

సూర్య, మమిత బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్​ అండ్ సన్స్’.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,  టీజర్‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌కు  మంచి రెస్పాన్స్ రాగా, శనివారం సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

జీవీ ప్రకాష్​ కుమార్ కంపోజ్ చేసిన ఈ వెడ్డింగ్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను సూర్య స్వయంగా పాడాడు. రామజోగయ్య శాస్త్రి  ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. ‘ఆజా అన్నాడే   రాజా చిన్నోడే.. బాజా మోగించి తాళి కట్టేస్తాడే.. ఎవరి గుండెలో ఎవరికి చోటని, ఎవరో ముందుగా రాసినవే.. ఎవరికి ఎవరు తోడని నీడని, కాలమే జత చేసినదే..’ అంటూ సాగిన పాట వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‌‌‌తో ఆకట్టుకుంది. ఆగస్టు 14న సినిమా వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.