బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం: ఆకునూరు మురళి

బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం: ఆకునూరు మురళి

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ డ్యామ్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని అర్థమవుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి ఆరోపించారు. నిందితుడు లేఖ రాస్తేనే.. నిందితుడి మీద కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. అన్నట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. 

“సీఎం లేఖ రాస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపిస్తాం” అని కిషన్ రెడ్డి అన్నట్లు ఓ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన క్లిప్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశారు. వేరే రాష్ట్రాల్లో సీఎంలు రాస్తేనే వారిపైకి ఈడీ, సీబీఐని పంపించారా అని ఆకునూరి మురళి ప్రశ్నించారు. సీఎం లేఖ రాయడు.. వీళ్లు సీబీఐని పంపరు అని ఎద్దేవా చేశారు.