హైదరాబాదీలకు పోలీసులు మాస్ వార్నింగ్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్భంగా ఎవరిమీద పడితే వాళ్లమీద రంగులు చల్లడం..ఇష్టం వచ్చినట్లు రోడ్లమీద తిరగడం చేయొద్దని హెచ్చరించారు. హోలీ రోజు మార్చి 3 ఉదయం 6 గంటల నుంచి మార్చి 4 సాయంత్రం 6గంటల వరకు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని..ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
బంజారాహిల్స్ TGICCCలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సజ్జనార్.. తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ వెళ్లే రోడ్స్ పై రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగొద్దన్నారు. కెమికల్ రంగులకు బదులు సహజ రంగులు వినియోగించాలని సూచించారు. హోలీ సందర్భంగా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు సజ్జనార్.
►ALSO READ | బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతాం: రాహుల్ గాంధీ
రంజాన్ మాసంలో ముస్లింల ప్రార్థనలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీస్ కమిటీలతో సమన్వయం, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మార్చి 3న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లిక్కర్ షాపులు, తాటి కాంపౌండ్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సజ్జనార్. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాల సూచించారు సజ్జనార్.
