MS Dhoni Dance: ప్రాక్టీస్ సెషన్లో MS ధోనీ డ్యాన్స్.. నెట్టింట క్రేజీ మూమెంట్స్ వైరల్

MS Dhoni Dance: ప్రాక్టీస్ సెషన్లో MS ధోనీ డ్యాన్స్.. నెట్టింట క్రేజీ మూమెంట్స్ వైరల్

MS Dhoni Dance: టీమిండియా మాజీ కెప్టెన్,  చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మళ్లీ నెట్స్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అంతేకాదు, అతడికి సంబంధించిన వీడియో ఒకటి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక బౌలర్ వేసిన వైడ్ బంతి వైడ్ గా వెళ్లింది.. దీంతో ధోనీ అక్కడ అంపైర్‌ లాగా చేతులు ఊపుతూ ‘వైడ్’ సిగ్నల్ ఇస్తూ సరదాగా స్పందించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ సీఎస్కే అభిమానులను కడుపుబ్బ నవ్విస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఇప్పటికీ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. తన కెప్టెన్సీలో సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ఘనత ఆయనదే. అయితే గత సీజన్ లో సీఎస్‌కేకు నిరాశాజనకంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలే సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఎంఎస్ ధోనీ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు.. 13 ఇన్నింగ్స్‌లలో 196 పరుగులు మాత్రమే చేసి సగటు 24.50, స్ట్రైక్‌రేట్ 135.17 నమోదు చేశారు. అత్యధిక స్కోరు 30 నాటౌట్ మాత్రమే.. అంతేకాకుండా, రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమైన సమయంలో ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ట్రైనింగ్ సెషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా భారత మాజీ సారథి ధోనీతో పాటు పలువురు ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. ఈసారి ట్రోఫీని దక్కించుకునేలా సీఎస్కే యజమాన్యం ప్లాన్ చేసింది. అందులో భాగంగా జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. అకీల్ హోస్సేన్ (రూ.2 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), కార్తీక్ శర్మ (రూ.14.20 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), అమన్ ఖాన్ (రూ.40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), మ్యాట్ హెన్రీ (రూ.2 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.2 కోట్లు), జాక్ ఫోల్క్స్ (రూ.75 లక్షలు)తో పాటు సంజూ శాంసన్ ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి రిటైన్ చేసుకున్నారు.