ఇందిరాపార్క్ దగ్గర భారీ సెక్యూరిటీ.. ఫొటోలు

ఇందిరాపార్క్ దగ్గర భారీ సెక్యూరిటీ.. ఫొటోలు

ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వడంతో.. రాష్ట్ర పోలీసులు అలర్టయ్యారు. ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని ముందుగా పోలీసులు చెప్పారు. ఐతే.. తెలంగాణ జనసమితి నాయకులు రిక్వెస్ట్ చేయడంతో.. టెంట్ వేసుకోవడానికి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. దీంతో.. అక్కడ టెంట్ వేశారు నాయకులు.ఐతే… ఆ ప్రాంతంలో చైర్లు వేసి… సభ లాంటిది నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు పోలీస్ లు.

ఇందిరాపార్కు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇందిరాపార్క్ నుంచి.. సెక్రటేరియట్ వైపు వెళ్లే మార్గాన్ని మూసేశారు. ఆ ప్రాంతంలో ముళ్లకంచెలు వేశారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు పోగైతే.. ట్రాఫిక్, శాంతిభధ్రతల సమస్య వస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు పోలీసులు.