ముద్దులు తర్వాత.. ముందు లైవ్ నడుస్తుంది చూడు : సీమా, సచిన్ చిలిపి చేష్టలు

ముద్దులు తర్వాత.. ముందు లైవ్ నడుస్తుంది చూడు : సీమా, సచిన్ చిలిపి చేష్టలు

సీమా హైదర్ ఈ సంవత్సరం ప్రారంభంలో తన ప్రేమికుడు సచిన్ మీనాను వివాహం చేసుకోవడానికి సరిహద్దు దాటినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్‌లలో వార్తల్లో నిలుస్తోంది. ఈ జంట అనేక సందర్భాల్లో వైరల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి వారు ఓ నేషనల్ ఛానెల్ లో లైవ్ లో ఉండగానే సన్నిహితంగా ఉంటూ కనిపించారు. దీంతో మరోసారి ఈ జంటకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతోంది.

వీరిద్దరికీ సంబంధించిన ఓ వీడియోలో సచిన్‌తో, సీమా చాలా సన్నిహితంగా ఉండటం కనిపించింది. సీమాను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించే ముందు.. అప్పటికీ లైవ్ లో ఉన్న యాంకర్.. ఆ జంటను కెమెరాలో ఉన్నారని, ఈ కార్యక్రమం నేషనల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని గుర్తు చేయడం కనిపిస్తోంది. కెమెరా ఆన్ లో ఉంది సచిన్ జీ అంటూ యాంకర్ నవ్వుతూ చెప్పడం కూడా ఇందులో చూడవచ్చు.

సీమా, సచిన్ లకు టెలివిజన్, సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ జంట ఇంకా దేనినీ ధృవీకరించలేదు, దేనీ మీద సంతకం చేయలేదు. వీరికి రోజురోజుకూ పాపులారిటీ పెరిగిపోతోంది. అంతే కాదు ఆమె ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 17 లో పోటీదారుగా స్థానం లభించిందని, కపిల్ శర్మ షోకు కూడా ఆహ్వానించబడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.