సీరియళ్ల కోడ్ ఉల్లంఘన: ప్రొడ్యూసర్లకు EC నోటీసులు

సీరియళ్ల కోడ్ ఉల్లంఘన: ప్రొడ్యూసర్లకు EC నోటీసులు

లోక్ సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జాబితాలో బయోపిక్ లు, వెబ్ సిరీస్ ల తర్వాత ఇప్పుడు టీవీ సీరియళ్లు కూడా చేరాయి . తాజాగా మహారాష్ ట్రలో రెండు హిందీ టీవీ సీరియళ్ల ప్రొడ్యూసర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు.రాజకీయంగా ప్రభావం చూపే కంటెంట్ ను తాము పరిశీలించాకే ప్రసారం చేయాలని ఆదేశించారు. బాభీజీ ఘర్ పర్ హై, తుజ్ సే హై రాబ్తా సీరియళ్లలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్,ముద్రా యోజన లాంటి బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రశంసించడంపై కాం గ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఫిర్యా దు చేసింది. బినైఫర్ కోహ్లి , సంజయ్ కోహ్లి కి చెందిన ఎడిట్ 2 ప్రొడక్షన్స్ (బాబీజీ ఘర్ పర్ హై), సోనాలి పొత్నిస్, అమీర్ జాఫర్ కు చెం దిన ఫుల్ మీడియా హౌస్ కు (తుజ్ సే హై రాబ్తా ) మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దిలీప్ షిండే నోటీసులు జారీ చేశారు. “రాజకీయంగా ప్రభావం చూపే కంటెంట్ ఉంటే ఎన్నికల అధికారులు పరిశీలించిన తర్వా తే టెలికాస్ట్ చేయాలని నిర్మా ణ సంస్థలకు ఆదేశించాం .ఎయిర్ అయిన కంటెం ట్ ను పరిశీలించాం . కోడ్ ఉల్లంఘన జరిగిం ది. వెం టనే సీరియళ్ల నుంచి ఆ కంటెంట్ ను తొలగించాలని ఆదేశించాం ” అని ఆయన అన్నారు . ఎన్నికల అధికారుల నోటీసులకు రెండు సీరియళ్ల ప్రొడ్యూసర్లు సమాధానం ఇచ్చారు. తమపై ఆరోపణలను తిరస్కరిం చారు. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని సాధారణంగానే స్కీముల గురించి చూపించి నట్లు తెలిపారు.