మహిళా క్లినిక్స్‌‌‌‌లో 1.85 లక్షల మందికి సేవలు

మహిళా క్లినిక్స్‌‌‌‌లో 1.85 లక్షల మందికి సేవలు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య మహిళా క్లినిక్స్‌‌‌‌లో ఇప్పటివరకు 1.85 లక్షల మంది మహిళలకు వైద్య సేవలు అందించామని ఆరోగ్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 272 ప్రభుత్వ దవాఖాన్లలో ప్రతి మంగళవారం మహిళల కోసం, మహిళా డాక్టర్లతో స్పెషల్‌‌‌‌గా అవుట్ పేషెంట్ సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి కావాల్సిన టెస్టులు చేయిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 1.85 లక్షల మంది మహిళలు ఈ సేవలను వినియోగించుకున్నారు.

ఇందులో ఐదుగురికి ఓరల్ క్యాన్సర్, 26 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 26 మందికి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. వీళ్లందరినీ హైదరాబాద్‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌జే క్యాన్సర్​హాస్పిటల్​కు రెఫర్ చేసి, ఇక్కడ ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి, వారికి సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌‌‌‌రావు ప్రకటించారు. మహిళలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.