ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు

రాంచీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతారా జిల్లాలో గూడ్స్ వాహనం, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు.. తిరయ్య గ్రామంలో జరిగిన ఫ్యామిలీ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆదివారం అర్థరాత్రి కథియా గ్రామం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్కును గూడ్స్ వాహనం  ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. 

ఈ ప్రమాదంలో మరో 23మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స  కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్‌పూర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మృతులను పాతర్రా గ్రామానికి చెందిన భూరి నిషాద్ (50), నీరా సాహు (55), గీతా సాహు (60), అగ్నియా సాహు (60), ఖుష్బు సాహు (39), మధు సాహు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ ( 6)లుగా గుర్తించినట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ దీపేష్ సాహు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించి వారిని పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.