
ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి. తను హీరోగా మరో కొత్త సినిమాని ఆదివారం అనౌన్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జాహ్నవి నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దీనికి దర్శకుడు. పోస్టర్‌లో ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’ అనే క్యాప్షన్‌ను హైలైట్ చేశారు.
రానా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘‘కావల్సిన వాళ్లకి కావల్సినంత రొమాన్స్, ఎంటర్‌టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ థ్రిల్స్ గ్యారెంటీ అమ్మ.. మీ అందరికీ శీఘ్రమేవ థ్రిల్లు ప్రాప్తిరస్తు” అని ట్వీట్ చేశాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీకి సంబంధించి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ స్టోరీలో ప్రియదర్శి హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని మేకర్స్ తెలియజేశారు.