హైదరాబాద్, వెలుగు: స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్ఈటీఎల్) 2026లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, లాభాలను నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 26.7 శాతం వృద్ధితో రూ.793 కోట్లకు చేరింది.
నికర లాభం 20.61 శాతం పెరిగి రూ.83 కోట్లుగా నమోదైంది. నాలుగో క్వార్టర్ ఆదాయం రూ.231 కోట్లుగా ఉండగా, రూ.21 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని సంస్థ వెల్లడించింది. సివిల్ కన్స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పట్టు సాధించడానికి స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త అనుబంధ సంస్థను ప్రారంభించింది.
