ఉద్యోగం పేరుతో కాలేజీ యువతిని లొంగతీసుకునే యత్నం

ఉద్యోగం పేరుతో కాలేజీ యువతిని లొంగతీసుకునే యత్నం

వరంగల్  అర్బన్ :  ఉద్యోగం ఇప్పిస్తానంటూ కాలేజీ అమ్మాయి పట్ల లైంగిక వేధింపులు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన వరంగల్ లో జరిగింది. నిజామాబాద్ కు చెందిన మడుగుల శంకర్ అనే వ్యక్తి.. వరంగల్ కు చెందిన కాలేజీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. జాబ్ పేరుతో రెండు సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆమెను లైంగికంగానూ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడేవాడని.. తన కోరిక తీరిస్తేనే డబ్బులు, జాబ్ ఇప్పిస్తానంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో కొద్దిరోజుల క్రితం హన్మకొండ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ మంగళవారం నిందితుడిని పట్టుకుని వరంగల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు.